Wednesday, January 9, 2019

https://www.youtube.com/watch?v=OKwJ4kqsDB8
జగన్ మోహన్ రెడ్డి ఇచ్ఛ పురం లో మాట్లాడిన  స్పీచ్

Tuesday, January 8, 2019





ఇచ్చాపురం లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి


రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దటూరు ఎమ్మెల్యే  ఇచ్చాపురం లో మాట్లాడిన స్పీచ్
https://www.facebook.com/mlarachamalluforce.force/videos/168071630631891/
 

Monday, January 7, 2019

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటూ ........ మీ వీరాభిమాని
జై రాచమల్లు జై జగన్ ,
కావాలి జగన్ రావాలి జగన్

       

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు 14 నెలలు గ 338 రోజులు 3607 కిలోమీటర్ల పాద యాత్ర ను పూరి చేసుకొని 9 వ తేదీన ఇచ్ఛ పురం లో ముగియనున్నది .
నిన్నటి దినమున టీవీ 9 లో జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ

https://www.youtube.com/watch?v=IddQj9c1OG4
 

Saturday, January 5, 2019

https://youtu.be/4QzoDVXmizc

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి గారు ప్రొద్దటూరు లో జరుగుతున్నా శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిరాహార దీక్ష లో పాల్గొని  వారి యొక్క ప్రసంగం చేసారు
 https://www.youtube.com/watch?v=4QzoDVXmizc&feature=youtu.be
ప్రజల రాజకీయ రారాజు శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి


ఇసుక క్వారీ 2వ రోజు నిరాహార దీక్షలో  ..... హాజరైన చిప్పగిరి ప్రసాద్ , లక్కిరెడ్డి పవన్ మరియు తదితర మహిళా సంఘాలు
https://www.youtube.com/watch?v=XlK1k_LCX68&t=131s

ఇసుక క్వారీ కోసం శ్రీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు 4/1/2019 నుండి నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు 

Thursday, January 3, 2019

Rachamallu Rajakeeya Prastanam

రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి 
ఆంద్ర సిరిపురి గా చారిత్రక వైజ్ఞానిక రాజకీయ సాంస్కృతిక పరంగా పేరెన్నిక గన్న నగరం ప్రొద్దటూరు నగరం
రాజకీయంగా తలపండిన హేమ హేమీలు తిరగలాడిన ప్రదేశమే  మన ప్రొద్దుటూరు అలాంటి హేమ హేమీలను సైతం తన వాగ్ధాటి, రాజకీయ చతురత , అకుంఠిత దీక్ష ఎనలేని మానసిక  స్తయ్ర్యం  తో ఎదురొడ్డి పోరాడి ధీటుగా నిలిచినా తిరుగులేని మన జన నేత YSRCP  శాసన సభ్యులు శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు.
   త్రేతా యుగం లో అయోధ్య రాముడు తాన రాజ్యానికి వెళుతూ వెళుతు మన ప్రొద్దటూరు రామేశ్వరం లో  శివుణ్ణి ప్రతిష్టించి, పూజించి   తిరిగి పయనం అయ్యారు. మరి ఈ కలియుగం లో ఆ రాముడు ప్రతిష్టించిన శివుని యొక్క శివ ప్రసాదమే  మన జన నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు. 
  రాచమల్లు ముని రత్నమ్మ మరియు రాచమల్లు శివ శంకర్ రెడ్డి , పుణ్య  దంపతతులకు మూడవ సంతానము గా 1966 వ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన జన్మించారు. రాచమల్లు తన ప్రాధమిక ఉన్నత విద్య భ్యాసాన్ని వసంతపేట మునిసిపల్ హై స్కూల్ లో పూర్తి చేసారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు రాచమల్లు పాటశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే CLASS లీడర్  గా SCHOOL PEOPLE లీడర్ గా ఉండి , నాయకత్వపు లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు, రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తన ఇంటర్ విద్య భ్యాసాన్ని వివేకానందా జూనియర్ కాలేజీ  లో ను SCNR గోవేర్నమేంట్ ఆర్ట్స్ కాలేజీ లో BA గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసారు. ఇంతింతై వటుడంతై  అన్నట్లు గా ఇంటర్ డిగ్రీ కళాశాల లో స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా ఎన్నికై విద్యార్థులు సమస్యల ఫై పోరాతూ తోటి విద్యార్థుల, అధ్యాపకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. మన రాచమల్లు 1993 వ
సంవత్సరం ఫిబ్రవరి 12 వ తేదీన తన మేనమామ కూతురైన రమాదేవిగారిని పరిణయమాడి, పల్లవి కృష్ణ కావ్య అనే ఇరువురు కుమార్తెలకు జన్మనిచ్చారు. ఈయన స్వాభిమాని స్వశక్తిపై  నిలవబడి ముందుకు సాగాలన్నదే ఆయన ఆశయం. తన మేన మామ 28వ వార్డ్ కౌన్సిలర్ శ్రీ పాతకోట విజయమునిరెడ్డి గారి కి చేదోడు వాదోడు గా కుడిభుజం లాగ ఆయన వెన్నంటే ఉండేవారు. 1998 లో విజయముని రెడ్డి గారి అకాల మరణం తో రాజకీయాలలోకి అలంకేతనం చేయవలసి వచ్చింది.  ప్రొద్దుటూరు 28 వ వార్డు ప్రజలు కీర్తి శేషులు విజయమునిరెడ్డి గారిని రాచమల్లుకి శివప్రసాద్ రెడ్డి గారి లో చూసుకొని ఆయన వారసుని గా 67% శాతం ఓట్లతో కౌన్సిలర్ గా ఎన్నుకున్నారు ఇక ఆనాటి నుండి నేటి వరకు ఆయన మడమ తిప్పలేదు, వెను తిరిగి చూడలేదు. 
 రాజకీయాలలో తార జువ్వలాగా దూసుకుంటూ పోతున్నారు ఆయన దూకుడు తగ్గించడానికి, రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసిన అవి హనుమంతుని ముందు కుప్పిగంతుల్లాగా మారిపోతున్నాయి. కౌన్సిలర్  గెలుపు తరువాత అప్పటి ఛైర్మెన్ అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయగా ప్రొద్దటూరు ఇంచార్జ్ ఛైర్పర్సన్ గా పదవి ఆయన ముంగిట్లో  వాలింది. అనుక్షణం ప్రజల బాగోగులు చూసుకుంటూ ప్రజలను అభిమానిస్తూ తనను నమ్ముకున్నవాళ్లను ఆదరిస్తూ పురాబాల సమస్యలను చురుకు గ పరిష్కరిస్తూ మెల్ల మెల్ల గా ప్రొద్దటూరు రాజకీయాలలో చక్రం తిప్పగలిగిన నాయకుని గా ఎదిగాడు తరువాత పురాబాల సంఘం లోనే కాక పక్కనున్న సోములవారి పల్లె పంచాయతీ లో కూడా సర్పంచ్ స్థానాన్ని గెలిపించుకొని తన పట్టును చాటాడు 2009 వ సంవత్సరం సాధారణ ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి రాజకీయ పురుగుడు దిడుగు  ఐన వరదరాజులు రెడ్డి గారి అభ్యర్తత్వాన్ని విభేదించి మల్లెల లింగారెడ్డి గారి గెలుపుకు నాంది పలికారు. 2009 లో వై ఎస్రాజశేఖర రెడ్డ్డి గారు అకాల మరణం పొందడం తో వీరాభిమాని గా  పార్టీ లకు అతీతం గా ప్రొద్దటూరు నగరం లో సంతాప సభను పెట్టి         వై . ఎస్ రాజశేఖర్ రెడ్డి ఫై తన అభిమానాన్ని భక్తి భావాన్ని నిర్భయంగా చాటుకున్నాడు. ఈక్రమంలోనే ఆయన మెల్ల మెల్లగా జగన్ గారి అభిమానాన్ని చూరగొంటూ వైస్సార్సీపీ పార్టీ లోకి ఆహ్వానించ బడ్డారు. అనంతరం ప్రొద్దటూరు వైస్సార్సీపీ కోఆర్డినేటర్ గా నియమింపబడి కడప పార్లిమెంట్ బై ఎలక్షన్ లో పోటీ చేసిన వై.ఎస్ జగనమొహన్ రెడ్డి గారికి ప్రొద్దుటూరు ప్రాంతం నుండి 70000 ల మెజారిటీ అందించారు, దీనితో వై.ఎస్ జగన్ రాచమల్లు మధ్య బంధం మరింత బలపడింది. ఆ బంధమే 2014 సాధారాణ ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ తరుపున ప్రొద్దుటూరు టికెట్ వచ్చేలా చేసింది ఈ ఎన్నికల్లో వరద రాజుల రెడ్డి గారి మీద 12900 ల ఓట్ల మెజారిటీ తో అఖండ విజయాన్ని సాధించారు ఈయన రాజకీయ జీవితం ఇలాగె మీరు పువ్వులు ఆరు కాయలు గా విరాజిల్లుతూ తదుపరి 2019 సాధారణ ఎన్నికల్లో కూడా మరోసారి వైస్సార్సీపీ ఎమ్మెల్యే గా విజయం సాధించాలని, జగన్ గారి ప్రభుత్వం లో మంత్రి పదవిని కూడా పొందాలని ఆసిద్ద్దాం. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే మరో వైపు ఆయన వ్యక్తికత జీవితం నిరంతరం ప్రజలసేవకు ప్రజల సమస్యలను తీర్చడానికి వెచ్చించే వారు ఈయన ప్రొద్దుటూరు నగరం లోని వివిధ వార్డులలో తన సొంత ఖర్చులతో లెక్కలేనన్ని సేవాకార్యక్రమాలు చేసారు. పేదలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వితంతువులకు వృద్దులకు శక్తివంచన లేకుండా పెన్షన్స్ అందించడం పట్టణం లోని పేద మహిళలు ఎక్కువగా ఉన్న వార్డులలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి పేద మహిళలకు శిక్షణ ఇప్పించి శిక్షణ పూర్తి ఐన తరువాత వారికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇప్పించి , వారు స్వశక్తి తో తమ కాళ్ల ఫై వారు బ్రతికేలా ఎందరినో ఆదుకొని వారి ఇంట పెద్దన్న గా స్థానాన్ని సంపాదించారు. ఇంకా పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, దుస్తులు ఇప్పించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు తన సొంత ఖ్ర్చులతో నిర్వహించారు, వేసవి కాలం లో ప్రజల దాహార్తి తీర్చడానికి తన అభిమానుల ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేయించడం ఎలా చెపుతూపోతే ఎన్నో సేవ కార్యక్రమాలను తన సొంత నిధులతో చేసి నిరూపించి చేతికి ఎముక లేని నాయకునిగా వేలుగొందాడు , మునిసిపల్ గ్రౌండ్స్ రిపేరి కొరకు తన సొంత డబ్బుల నుండి 50 లక్షల రూపాయలను ఖర్చు చేసి తన సేవ తత్పరత ముందు ప్రొద్దుటూరు లో ఏ నాయకుడు సాటి రాదనీ రుజువు చేసాడు అందుకే అభిమానులు ప్రొద్దుటూరు ప్రజలు ఇలాంటి గొప్ప భావాలున్న మహా మనిషిని ఆశీర్వదించి మల్లి మల్లి ఎన్నుకొని ఆయన సేవ తత్పరత లలో తడిసి ముద్దవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

https://www.youtube.com/watch?v=OKwJ4kqsDB8 జగన్ మోహన్ రెడ్డి ఇచ్ఛ పురం లో మాట్లాడిన  స్పీచ్